చాట్రాయి: మాధవరెడ్డి కుటుంబానికి ఎస్పీ సహాయం

చాట్రాయి పోలీస్ స్టేషన్లో పనిచేస్తూ అనారోగ్యంతో మరణించిన వి. మాధవ రెడ్డి కుటుంబానికి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అండగా నిలిచారు. సోమవారం, ఫ్లాగ్ ఫండ్ నుంచి రూ. 25,000, విడో ఫండ్ నుంచి రూ. 50,000 చొప్పున మొత్తం రూ. 75,000 ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మాధవ రెడ్డి సేవలు మరపురానివని, వారి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని ప్రయోజనాలు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్