రేపు నూజివీడులో 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'

నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించవచ్చని, ప్రతి అర్జీని ఆన్‌లైన్‌లో నమోదు చేసి నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యల కోసం ప్రత్యేక క్లినిక్‌లు కూడా ఏర్పాటు చేశామని ఆమె వెల్లడించారు.

సంబంధిత పోస్ట్