పాలకొల్లు దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు బాధ్యతలు స్వీకరణ

పాలకొల్లులోని శ్రీ అష్టభుజ లక్ష్మీ నారాయణస్వామి వారి దేవస్థానం (చిన్నగోపురం) నూతన ట్రస్ట్ బోర్డు ఆదివారం మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పదవి బాధ్యతలు చేపట్టింది. చైర్మన్ గా రేపాక ప్రవీణ్ భాను, శేషబట్టరు పవన్ విజయ్ కుమార్ తో పాటు 8 మంది ట్రస్ట్టీ లుగా ప్రమాణస్వీకారం చేశారు. నూతన ట్రస్ట్ బోర్డు దేవస్థానం కీర్తి ప్రతిష్టలను పెంచేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్