పాలకొల్లులో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఇండోర్ మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ పేట ఫీడర్ లైన్ పై చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. EE మధుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బస్‌స్టాండ్ ఏరియా, మావుళ్లమ్మపేట, కెనాల్ రోడ్డు, శ్రీరామ్ పేట, వడలి వానిపేట, శాంతి నగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదు.