గోదావరి పరివాహక ప్రాంతాలలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అందరిని అప్రమత్తం చేయాలన్నారు. బలహీనంగా ఉన్న కాలువలు, నదీ పరీవాహక ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అధిక వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకుని, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో వరద పునరావాస కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించమన్నారు.