ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో ఈ నెల 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు జిల్లా సమీక్షా సమావేశం జరగనుంది. జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రెవిన్యూ అంశాలు, పేదలకు గృహ నిర్మాణం, 22ఏ, హార్టికల్చర్, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి, రహదారులు వంటి పలు కీలక అంశాలపై సమీక్షిస్తారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రులు, శాసనమండలి, శాసనసభ్యులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొంటారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఈ ప్రకటన ఏలూరు జిల్లా సమాచార శాఖ ద్వారా వెలువడింది.