ఏలూరులో వైభవంగా జరుగుతున్న పడమర వీధి గంగానమ్మ జాతర మహోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ పటిష్ట బందోబస్తు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈసారి జాతరలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచుతున్నారు. రద్దీని నియంత్రించడం, దొంగతనాలను అరికట్టడం, ట్రాఫిక్ సజావుగా సాగేలా చూడటం వంటి చర్యలు చేపడుతున్నారు. భక్తుల సౌకర్యార్థం భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు, మహిళా పోలీసులు, క్లూస్ టీమ్స్, ప్రత్యేక నిఘా బృందాలు, తప్పిపోయిన వారి కోసం హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు.