ఆపరేషన్ చిన్నారి తల్లి, ఆపరేషన్ దండయాన్ పై మహిళలకు అవగాహన

తాడేపల్లిగూడెం జీవీ మాల్ సెంటర్లో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నిర్మూలనకు పోలీసుల అవగాహన కార్యక్రమం జరిగింది. పట్టణ సీఐ ఆది ప్రసాద్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఆదేశాల మేరకు, డీఎస్పీ విశ్వనాథ్ సూచనలతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆపరేషన్ చిన్నారి తల్లి, ఆపరేషన్ దండయాన్ వంటి కార్యక్రమాల గురించి మహిళలు, చిన్నారులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విస్తృత అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.

సంబంధిత పోస్ట్