హెల్మెట్ లేకుంటే ప్రాణాలకు ముప్పు.. సీఐ ఆధిప్రసాద్

తాడేపల్లిగూడెం పోలీస్ ఐలాండ్ సెంటర్లో బుధవారం సాయంత్రం పట్టణ సీఐ బి. ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, రోడ్లపై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. హెల్మెట్ ధరించడాన్ని ఒక బాధ్యతగా భావించాలని వాహనదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్