తణుకు సబ్ జైలును సందర్శించిన న్యాయమూర్తులు

శనివారం గౌరవ చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీమతి సిరిపురపు శ్రీదేవి తణుకు సబ్ జైల్ ను సందర్శించి, ముద్దాయిలకు అందుతున్న ఆహారం, వసతి, వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని కోరారు. న్యాయవాదిని పెట్టుకోలేని వారికి మండల న్యాయ సేవా సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని, జైలు విజిటింగ్ న్యాయవాది, పారా లీగల్ వాలంటీర్లు వారానికి రెండు రోజులు జైలు క్లినిక్ లో సలహాలు ఇస్తారని తెలిపారు.

సంబంధిత పోస్ట్