కోపల్లె నాలుగు లేన్ల వంతెన పనులను పరిశీలించిన జిల్లాకలెక్టర్

కాళ్ళ(M)కోపల్లెలో రూ. 12 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నాలుగు లేన్ల వంతెన పనులను కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజల రాకపోకల సౌకర్యం మెరుగుపడేలా చేపడుతున్న మౌలిక వసతుల అభివృద్ధిలో ఈ వంతెన కీలకమని, భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పనులు పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్