గ్రామ అభివృద్ధికి సర్పంచ్ శివయ్య సేవలకు ఘన సన్మానం

ఉండి మండలం చెరుకువాడలో మంగళవారం గ్రామ పంచాయతీ, సచివాలయం ఉద్యోగులు, సిబ్బంది సర్పంచ్ శివయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఉండి మేజిస్ట్రేట్ K నాగార్జున మాట్లాడుతూ, శివయ్య గ్రామాభివృద్ధికి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి పాటుపడ్డారని ప్రశంసించారు. డిప్యూటీ ఎం పి డి వో రెడ్డియ్య, RWS డిఈ T శ్రీనివాసరావు, AE హరనాధరాజు, సుభాషిణి, డా. రంగరాజులు కూడా శివయ్య గ్రామ అభివృద్ధిలో పోషించిన పాత్రను కొనియాడారు. ఈ సన్మానం గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా జరిగింది.

సంబంధిత పోస్ట్