ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్టు బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. ఎస్. వి. సుధాకర్ రావు దేవస్థానం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించగా, 17 మంది పాలకవర్గ సభ్యులు, ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.