ఉంగుటూరు: అవసరానికి మించి ఇంధనం నిల్వ ఉంచితే చర్యలు

సోమవారం ఉంగుటూరు నియోజకవర్గంలోని కూరెళ్లగూడెం, పూళ్ల, కైకరం గ్రామాల్లోని పెట్రోల్ బంకులను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంకుల్లో ఇంధన నిల్వలు, ఇన్‌లెట్-అవుట్‌లెట్ వివరాలపై నిర్వాహకులను ప్రశ్నించి పరిస్థితిని సమీక్షించారు. అవసరానికి మించి ఇంధనం నిల్వ ఉంచినా, స్టాక్ ఉన్నప్పటికీ సరఫరా నిలిపివేసినా కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. వదంతులు వ్యాప్తి చేసే వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్