శనివారం ఉంగుటూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొని, మండల పరిధిలో పూర్తైన అభివృద్ధి పనులు, ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. వివిధ గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను ప్రజా ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, MPDO, పంచాయతీ శాఖ అధికారులు పాల్గొన్నారు.