ఉంగుటూరు మండలం కైకరం జడ్పీ హై స్కూల్ ను జడ్పీ చైర్ పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాల పరిశుభ్రత, తరగతి గదుల స్థితిగతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు వంటి అంశాలను ఆమె సమగ్రంగా పరిశీలించారు. పాఠశాల పరిసరాలలో పరిశుభ్రత లోపించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధానోపాధ్యాయులను ఆమె మందలించారు.