ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుభవార్త అందించారు. గుంటూరు జిల్లా తెనాలిలో రూ.20కే కిలో గోధుమ పిండి అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రేషన్‌కార్డులు ఉన్నవారికి నాణ్యమైన సరుకుల్ని అందిస్తున్నామని, కిలో గోధుమ పిండి రూ.20కే అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఏపీ ప్రభుత్వం కిలో రేషన్ బియ్యంపై రూ.47.10 ఖర్చు చేస్తోందని, పాలిష్ చేసిన సన్నబియ్యంతో పోలిస్తే రేషన్ బియ్యం ఆరోగ్యానికి మంచివని ఆయన పేర్కొన్నారు.