హిందూ దేవాలయంలో ముస్లిం పూజారి.. ఎక్కడంటే?

AP: కర్నూలు జిల్లా ప్యామిలి పట్టణంలో మతసామరస్యానికి నిదర్శనంగా నిలుస్తున్న ఒక అమ్మవారి ఆలయం ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడ ఇమాం బాషా అనే ముస్లిం వ్యక్తి ప్రధాన పూజారిగా సేవలందిస్తున్నారు. తనకు కలలో అమ్మవారు కనిపించి పూజలు చేయమని ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత సొంత డబ్బులు, చందాలతో ఆలయాన్ని పునర్నిర్మించారు. ప్రస్తుతం ఆయన పంచ కట్టుకుని, హిందూ సంప్రదాయ పద్ధతిలో నిత్యం వేదమంత్రాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ భక్తులను ఆశ్చర్యపరుస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕