

TG: సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీసులు (VIDEO)
హైదరాబాద్‌లోని బేగంపేట ట్రాఫిక్ పోలీసులు సీపీఆర్ చేసి వ్యక్తి ప్రాణాలు కాపాడారు. నగరంలోని పీఎన్టీ జంక్షన్ వద్ద రోడ్ క్రాస్ చేస్తూ సురేష్ అనే వ్యక్తి పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన సురేష్‌కు అక్కడి ట్రాఫిక్ పోలీసులు వెంటనే సీపీఆర్ చేశారు. స్పృహలోకి వచ్చిన వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. సురేష్.. కొమురం భీమ్ జిల్లా సిరిపూర్ కాగజ్‌నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.