ఏపీలోని గుంటూరు జిల్లా వేదికగా మూడో ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు సత్యసాయి ఆధ్యాత్మిక నగరి వేదికైంది. తెలుగు భాషా సాహిత్యాల పరిరక్షణ, సంస్కృతిని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ సభలను ఏర్పాటు చేశారు. ఈ మహాసభల ప్రారంభోత్సవ వేడుకలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని తెలుగు భాషా విశిష్టతను కొనియాడారు.కాగా ముగింపు వేడుకలకు సీఎం చంద్రబాబు హాజరవుతారు. డాక్టర్ ఘంటసాల, డాక్టర్ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం సభా వేదికలకు వారి పేర్లు పెట్టారు.