ఐస్ క్రీం తిన్నా, అమ్మినా జరిమానా కట్టాల్సిందే

వేసవిలో ఐస్ క్రీం అమ్మకాలు, వినియోగంపై ఏలూరు జిల్లాలోని కుక్కునూరు మండలం నేమిలిపేట గ్రామంలో గ్రామస్తులు నిషేధం విధించారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐస్ క్రీం అమ్మితే రూ. 3,000, కొని తింటే రూ. 1,000 జరిమానా విధిస్తారు. నాణ్యత లేని ఐస్ క్రీంల వల్ల పిల్లల్లో అనారోగ్య సమస్యలు, భవిష్యత్తులో క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యం" అనే నినాదంతో తీసుకున్న ఈ నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్