వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. పార్లమెంట్‌లోకి వెళ్తున్న సమయంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది. పిల్లి సభాష్ అస్వస్థత విషయాన్ని మరో వైసీసీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. చంద్రబోస్ కొంతకాలం షుగర్ సమస్యతో బాధపుడుతున్నారని సుబ్బారెడ్డి వెల్లడించారు. షుగర్ లెవెల్స్ బాగా పడిపోవడంతో చంద్రబోస్ కిందపడిపోయారని, పార్లమెంట్‌లోనే ఆయన వైద్య చికిత్స అందించినట్లు సబ్బారెడ్డి తెలిపారు.