TG: రాష్ట్రంలో 12 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో సీనియర్ అధికారి జయేశ్ రంజన్‌ను ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్, టెక్నాలజీ శాఖల చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకోనున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ బదిలీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా వికాస్ రాజ్ విద్యుత్ శాఖ సీఎస్‌గా నియమితులయ్యారు. అలాగే నవీన్ మిట్టల్, శైలజా రామయ్యర్, రాహుల్ బొజ్జా, సర్ఫరాజ్ అహ్మద్, శృతి ఓజా, ముషారఫ్ అలీ ఫారూఖీ సహా పలువురు అధికారులకు వివిధ శాఖల్లో కీలక బాధ్యతలను కేటాయిస్తూ ఉత్తర్వులను వెలువరించింది.