అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన గ్లెన్వుడ్ జాస్కిన్ జూనియర్ (60) గిన్నిస్ రికార్డు సృష్టించారు. 2024 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ మధ్య యార్క్ హెవెన్‌లోని రీగల్ థియేటర్లో ఏకంగా 1,207 సినిమాలు వీక్షించారు. ఇందుకోసం ఒక్కోసారి తెల్లవారుజామునే థియేటర్‌కు వచ్చి అర్ధరాత్రి వరకు గడిపేవారు. ఒకే సినిమాను అత్యధికసార్లు చూసిన రికార్డు కూడా ఆయన సొంతం. ఇన్ని సినిమాలు చూసినా ఏ సినిమాను తాను నచ్చలేదని చెప్పలేదన్నారు.