ఏప్రిల్ నెలలో బ్యాంకులు దాదాపు 14 రోజులు మూతపడనున్నాయి. దేశవ్యాప్త సెలవులతో పాటు ప్రాంతీయ పండుగలు కూడా ఉన్నాయి. ఏప్రిల్ 1న వార్షిక బ్యాంక్ సెలవు, 2న పవిత్ర గురువారం, 3న గుడ్ ఫ్రైడే, 5, 12, 19, 26 తేదీల్లో ఆదివారం సెలవులు. 11, 25 తేదీల్లో రెండో, నాలుగో శనివారాలు. 14న అంబేడ్కర్ జయంతి, 15న బెంగాలీ న్యూ ఇయర్, 16న భోగహ్ బిహు, 20న అక్షయ తృతీయ, 21న గరియా పూజ (త్రిపురలో) సెలవులు. బ్యాంకులు మూసి ఉన్నా డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి.