దక్షిణ భారతదేశంలోని 1500 ఏళ్ల చరిత్ర కలిగిన మహానంది పుణ్యక్షేత్రం, చాళుక్య రాజులచే నిర్మించబడింది. ఇక్కడి రుద్రగుండం కోనేరులోని నీటి ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందో శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యంగానే మిగిలింది. నల్లమల్ల అడవి నుంచి వచ్చే ఈ నీరు ఆలయ గర్భగుడిలోని స్వామి విగ్రహం కింద నుంచి బ్రాహ్మగుండంలోకి ప్రవహిస్తుంది. కరువు ప్రాంతంలో కూడా ఈ కోనేరు ఎప్పుడూ ఎండిపోకుండా ఒకే స్థాయిలో నీటితో నిండి ఉంటుంది. ఈ స్వచ్ఛమైన నీటిలో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం.