త్వరలో అంగన్‌వాడీల్లో 15,982 పోస్టుల భర్తీ!

TG: రాష్ట్రంలో నిరుద్యోగ మహిళలకు రేవంత్ సర్కార్ త్వరలో శుభవార్త చెప్పనుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీ స్థాయిలో 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఏడాదిలోగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నియామక ప్రకటనలు జారీ చేసి, పోస్టులన్నీ భర్తీ చేయాలని కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో అత్యధికంగా సహాయకుల పోస్టులు 12,882 ఉంటే.. టీచర్‌ పోస్టులు 3,100గా ఉన్నాయి.

సంబంధిత పోస్ట్