రాబోయే పండగల సీజన్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు అక్టోబరు 6 నుంచి నవంబరు 25 వరకు ప్రతి మంగళ, బుధవారాల్లో (07037/07038) అందుబాటులో ఉంటాయి. నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. వీటిలో ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని సీపీఆర్వో తెలిపారు.