భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) మరణించిన వ్యక్తులకు చెందిన 2.5 కోట్ల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసింది. ఆధార్ డేటాబేస్‌ను ఖచ్చితంగా ఉంచడానికి ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఐడెంటిటీ మోసాలను, ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలను అనధికారికంగా ఉపయోగించుకునే మోసాలను అరికట్టడానికి ఇది దోహదపడుతుంది. గత నవంబర్‌లో 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ అయ్యాయి. ఈ ప్రక్రియ కోసం యూఐడీఏఐ వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి డేటాను సేకరించింది.