ఉత్తరాఖండ్‌లో 23 మంది నకిలీ బాబాలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి సూచనల మేరకు అధికారులు వారి కోసం జల్లెడ పడుతున్నారు. మతం పేరుతో ప్రజలను మోసం చేసే వేషధారులకు వ్యతిరేకంగా 'ఆపరేషన్ కలనేమి' ప్రారంభించి రాష్ట్రంలో తీవ్రస్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. అయితే ఈ 23 మందిలో 10 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఆపరేషన్‌కు హిందూ మత సంఘాలు కూడా స్వాగతిస్తున్నాయి.