ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ విలీనానికి అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్‌లకు సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 25న జరిగిన జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో 27 మున్సిపాలిటీల విలీన అంశాన్ని టేబుల్ ఎజెండాగా పెట్టి ఆమోదించారు. దీనిపై సోమవారం నాడు అధికారికంగా ఆర్డినెన్స్ విడుదల చేయనున్నారు.