ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ సోమవారం కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్యలు, భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికపై చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక స్పెషల్ అధికారిని నియమించాలన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి ఆమోదం తర్వాతే తుది లబ్ధిదారుల జాబితా ప్రకటించాలని సూచించారు. ఎక్కడ లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్