TG: ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక GPO, ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి 4-6 వరకు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇందుకు సంబంధించి ఈనెల 27న శిక్షణ పొందిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత 28, 29న ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష ఉంటాయని.. AUG 12న ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఉత్తీర్ణులైన అభ్యర్దులకు 40 రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని చెప్పారు.