5 కోట్ల ఏళ్ల నాటి పురాతన రాయి గుర్తింపు

TG: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రామాలయం ఆవరణలో పురావస్తు శాస్త్రవేత్త శివనాగిరెడ్డి 5 కోట్ల సంవత్సరాల కిందటి పురాతన రాయిని గుర్తించారు. ఆలయ పున: నిర్మాణం కోసం వీరిని ఆహ్వానించగా అక్కడ దానిని గుర్తించి దారుశిలజంగా పేర్కొన్నారు. ఆయన విస్తృత పరిశీలన కోసం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన ఆ రామలయం వద్ద ఈ రాయి కనిపించడంతో ఆలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్