1976, అక్టోబర్ 31న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో భారత మహిళల క్రికెట్ ప్రస్థానం మొదలైంది. సరిగ్గా 50 ఏళ్ల క్రితం జరిగిన ఈ తొలి అధికారిక టెస్టు మ్యాచ్‌లో శుభాంగి కులకర్ణి అద్భుత బౌలింగ్, శాంతా రంగస్వామి చారిత్రక సిక్సర్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాయి. నేడు ప్రపంచ స్థాయిలో దూసుకుపోతున్న మహిళా క్రికెటర్ల ఎదుగుదల వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయి. ఈ సందర్భంగా బీసీసీఐ మాజీ కెప్టెన్లను ఘనంగా సత్కరించింది.