పారా ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ 53 పతకాలతో పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. మంగళవారం భారత పారా స్ప్రింటర్ సిమ్రాన్ టీ12 100 మీటర్ల ఈవెంట్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఇదే పోటీల్లో ఆమె 200 మీటర్ల ఈవెంట్లోనూ స్వర్ణం సాధించడం విశేషం. అలాగే పురుషుల టీ47 100 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్లో దిలీప్ స్వర్ణాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుతం భారత్ ఖాతాలో 14 స్వర్ణాలు, 19 రజతాలు, 20 కాంస్య పతకాలతో మొత్తం 53 పతకాలు ఉన్నాయి.