బ్రిటిష్ రచయిత ఎం జాన్ హారిసన్ తన 'ద ఎండ్ ఆఫ్ ఎవిరిథింగ్' నవలకు ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ 2026ను గెల్చుకున్నారు. లండన్లోని ఓల్డ్బిల్డింగ్స్గేట్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఈ విజేతను ప్రకటించారు. 81 ఏళ్ల వయసులో ఈ పురస్కారాన్ని అందుకున్న అత్యంత వృద్ధ రచయితగా హారిసన్ రికార్డు సృష్టించారు. సైన్స్ ఫిక్షన్ ప్రక్రియకు దక్కిన ఈ అరుదైన గౌరవంతో పాటు, హారిసన్కు 67 వేల డాలర్ల ప్రైజ్మనీ లభిస్తుంది. గత ఐదు దశాబ్దాలుగా ఆయన సాహితీ ప్రస్థానంలో ఎంతో కృషి చేస్తున్నారు.