83,545 మంది అనర్హులకు రేషన్‌ బియ్యం: కాగ్

తెలంగాణలో రేషన్‌ పథకంలో కీలక లోపాలు కాగ్‌ సమీక్షలో వెలుగుచూశాయి. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, పెద్ద రైతు భూమి కలిగిన వారు కూడా రేషన్‌ లబ్ధిదారులుగా నమోదై (83,545 మంది) రేషన్‌ బియ్యం పొందుతున్నారు. ఇందుకు రూ.135.16 కోట్లు ఖర్చు అయ్యిందని కాగ్‌ వెల్లడించింది. 2020–21 పీఎం కిసాన్‌ డేటా ప్రకారం 52,339 మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు, 5,886 మందికి 15 ఎకరాల పైగా భూమి కలిగిన వారు ఉన్నారు. 2020–21లో 16,128 మంది, 2021–22లో 25,320 పలు కేసులలో మరణించగా వారికి ఇంకా రేషన్ కొనసాగుతోందని కాగ్ పేర్కొంది.

సంబంధిత పోస్ట్