8th పే కమిషన్‌‌.. పెరగనున్న జీతాలు?

8th పే కమిషన్‌తో రూ.55-69 వేలకు జీతాలు పెంచాలని ఉద్యోగ సంఘాలు ప్రతిపాదనలు పంపాయి. 2016లో 7th పే కమిషన్ రూ.7 వేల బేసిక్ పేను రూ.18 వేలకు పెంచింది. దాంతో 8th పే కమిషన్‌లో బేసిక్ పే మరింత పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. పదేళ్ల క్రితం పరిస్థితులతో పోల్చితే ఆహారం, ఆరోగ్యం, రవాణా, ఇంటి అద్దె, విద్య తదితర అన్ని ఖర్చులు భారీగా పెరగడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. దాంతో 8th పే కమిషన్‌తో బేసిక్ పే ఎంత వరకు పెరుగుతుందన్న చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్