తెలంగాణ SIRలో 95 లక్షల ఓట్ల తొలగింపు!

తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగించారంటూ జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సి. సుదర్శన్‌రెడ్డి స్పష్టతనిచ్చారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏఎస్‌డీడీ కేటగిరీలో 73,39,235 మందిని గుర్తించామని, అయితే వీరిని తుది జాబితా నుంచి తొలగించినట్లు కాదని, అర్హతను పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే ఓట్ల తొలగింపుపై స్పష్టత వస్తుందని ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్

✕
✕