9 ఏళ్ల శ్వేతిమ మాధవ్ ప్రియ ఆధ్యాత్మిక జ్ఞానంలో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డు సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌కు చెందిన ఈ బాలిక అంతర్జాతీయ భాగవత ప్రవచనకర్తగా ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు సంపాదించింది. అతి పిన్న వయస్కురాలిగా ఈ ఘనత సాధించిన శ్వేతిమ, ఆరేళ్ల వయసు నుంచే శ్రీమద్భాగవత కథ చెప్పడం ప్రారంభించింది. ఇప్పటివరకు 36 వారాల పాటు భాగవత కథా ప్రవచనాలు చెప్పడంతో పాటు, 100కు పైగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంది.