హామీ లేకుండా రూ.50 వేల వరకు రుణం

కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులు, చిన్న దుకాణాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ క్రమంలో పీఎం స్వనిధి పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణం అందిస్తోంది. సకాలంలో చెల్లిస్తే వడ్డీ రాయితీ, డిజిటల్ లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇప్పుడు రూ.30 వేల వరకు క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. తొలి రుణం రూ.10 వేలు, సకాలంలో చెల్లిస్తే రూ.20 వేలు, ఆ తర్వాత రూ.50 వేల వరకు విడతల వారీగా రూ.80 వేల వరకు రుణం పొందవచ్చు.

సంబంధిత పోస్ట్