గుడ్డు పెట్టిన కోడిపుంజు.. షాకైన గ్రామస్తులు!

AP: శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం బొర్రంపేటలో ఒక కోడిపుంజు గుడ్డు పెట్టడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఈ వింత సంఘటన చోటుచేసుకుంది. కోడిపుంజు గుడ్డు పెట్టడంతో సతీష్, అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. అయితే, జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి అసాధారణ సంఘటనలు జరుగుతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు వివరించారు.

సంబంధిత పోస్ట్