కిలో ఆలుగడ్డ రూ.లక్ష.. ఎక్కడంటే?

సాధారణంగా కిలో బంగాళాదుంప రూ.30-50 మధ్య దొరుకుతుంటే, ఫ్రాన్స్‌లో పండే ‘లే బోనోట్’ అనే అరుదైన రకం ధర మాత్రం రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు పలుకుతోంది. ఫ్రాన్స్‌లోని నోయిర్‌మౌటియర్ ద్వీపంలో మాత్రమే ఇది పండుతుంది. ఏడాదిలో కేవలం 10 రోజుల పాటు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. సముద్రపు ఇసుక నేలల్లో, సముద్రపు నాచును సహజ ఎరువుగా ఉపయోగించి సాగు చేయడం దీని ప్రత్యేకత. కోత సమయంలో యంత్రాలు వాడకుండా చేతులతోనే సేకరిస్తారు. ప్రత్యేక రుచి, పరిమిత ఉత్పత్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ చెఫ్‌లు, లగ్జరీ హోటళ్లు వీటిని భారీ ధరలకు కొనుగోలు చేస్తుంటాయి.

సంబంధిత పోస్ట్