ఉగ్రవాది అంటే ఉగ్రవాదే: ఐక్యరాజ్యసమితిలో భారత్ స్పష్టీకరణ

ఐక్యరాజ్యసమితిలో భారత్ ఉగ్రవాదంపై తన వైఖరిని స్పష్టం చేసింది. 'ఉగ్రవాది అంటే ఉగ్రవాదే, వారిని ఏ రూపంలోనూ సమర్థించకూడదు' అని భారత ప్రతినిధి హరీష్ పర్వతనేని గురువారం జరిగిన 'ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ (జీసీటీఎస్)' తొమ్మిదో సమీక్ష ఆమోదం సందర్భంగా తెలిపారు. భారత్ దశాబ్దాలుగా సరిహద్దు దాటి వస్తున్న ఉగ్రవాద చర్యలకు బలవుతూ వేలాది మంది ప్రాణాలను కోల్పోయిందని, ఉగ్రవాదానికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి దేశంపై ఉందని, ఈ విషయంలో సభ్య దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్