ఆధార్ కార్డు ఉన్నవారికి UIDAI ఒక శుభవార్త అందించింది. జులై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు, అంటే రాబోయే ఆరు నెలల పాటు, ఆధార్ కార్డుదారులు తమ ఈమెయిల్ ఐడీని ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు ఈమెయిల్ ఐడీని మార్చుకోవడానికి రూ.75 ఫీజు వసూలు చేస్తున్న యూఐడీఏఐ.. ఈ నిర్ణయంతో ఆ ఫీజును మాఫీ చేసింది. అయితే ఈ ఉచిత సదుపాయం కేవలం ఆధార్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీని అప్డేట్ చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుంది. ఆధార్ యూజర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.