ఆధార్ కార్డు భారత పౌరసత్వానికి రుజువు కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై విచారణ సందర్భంగా.. ఆధార్ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు కల్పించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. చొరబాటుదారులు ఆధార్ కార్డులు పొందితే వారికి ఓటు హక్కు ఇస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షేమ పథకాల కోసం ఆధార్ ఏర్పాటు చేయబడిందని, రేషన్ కార్డు కోసం ఆధార్ పొందిన వ్యక్తికి ఓటర్ కార్డు ఇవ్వరాదని తెలిపింది.