60 ఏళ్లుగా చొక్కా, చెప్పులు లేకుండా తిరుగుతున్న వ్యక్తి

TG: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపుర్ గ్రామానికి చెందిన ముక్కెర బక్కన్న (70) చిన్నతనం నుంచి చొక్కా వేసుకోవడానికి ఇష్టపడడు. 60 ఏళ్లుగా చొక్కా లేకుండానే వ్యవసాయం చేస్తూ, గ్రామ పంచాయతీ సమావేశాలకు హాజరవుతూ, అందరితో కలిసిమెలిసి ఉంటున్నాడు. 20 ఏళ్ల క్రితం మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు అతడిని 'అయిలాపుర్ గాంధీ'గా పేరు పెట్టారు. చెప్పులు కూడా వేసుకోని బక్కన్న ప్రకృతిని అమితంగా ప్రేమిస్తాడు. అతడిని అందరూ 'అభినవ గాంధీ'గా పిలుచుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్