చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలు, సేఫ్ డిపాజిట్ లాకర్లు క్లెయిమ్ సెటిల్‌మెంట్ నిబంధనలను RBI సవరించింది. 15 రోజులలో సెటిల్‌మెంట్ పూర్తయ్యేలా చూడాలని, ఆలస్యమైతే ఖాతాలకు 4% వడ్డీ, లాకర్లకు రోజుకు ₹5,000 చొప్పున పరిహారం చెల్లించాలని తెలిపింది. ఖాతాలో సహకార బ్యాంకులకు రూ.5 లక్షలు, ఇతర బ్యాంకులకు రూ.15 లక్షలుగా ఈ పరిమితి ఉంది. ఈ పరిమితికి మించి మొత్తం ఉంటే వారసత్వ ధ్రువీకరణ పత్రం లేదా అదనపు పత్రాలను కోరవచ్చని తెలిపింది.