సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలి: హైకోర్టు

TG: సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకోవాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాలేజీల నుండి వేధింపులకు గురవుతున్న విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పట్ల ఉన్న బకాయిలపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్